తాజా వార్తలు

Sunday, 27 December 2015

అగ్ని ప్రమాదం అరిష్టం కాదు..దేవాతను గ్రహమే...!

సీఎం కేసీఆర్ నిర్వహించిన అయుత చండీ మహాయాగం దిగ్విజయంగా జరిగిందని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ప్రకటించారు. యాగశాలలో జరిగిన స్వల్ప అగ్ని ప్రమాదం అరిష్టం కాదని స్పష్టం చేశారు. క్రతువులో భాగంగా పూర్ణాహుతి అయిన తర్వాత యాగ శాల కాల్చేయాలని శాస్త్రం చెపుతోందిని అన్నారు. ప్రస్తుతం అలాగే జరిగిందనియాగానికి సంతుష్టురాలై చండీ అమ్మవారే విధంగా అనుగ్రహించారని చెప్పారు. యాగం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారుసీఎం కేసీఆర్ లోక కళ్యాణార్థం ఐదు రోజులపాటు నిర్వహించిన అయుత చండీ మహా యాగం భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో నిర్వఘ్నంగా ముగిసింది. వేద మంత్రోచ్చారణల మధ్య మహా పూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తమైంది. ఇవాళ వేద పండితుల శాస్ర్తోక్త మంత్రాలు, వేద మంత్రోచ్చరణ మధ్య పూర్ణాహుతి క్రతువుతో యాగాన్ని ముగించారు. పట్టు వస్ర్తాలు, పుష్పం, ఫలం, సుగంధ ద్రవ్యాలతో మహా పూర్ణాహుతి జరిపించారు. సీఎం కేసీఆర్ దంపతులు పూర్ణాహుతి సామాగ్రిని హోమంలో వేసి క్రతువును ముగించారు. యాగం ముగింపు సమయంలో చతుర్వేద స్వాహాకారాలతో యాగశాల మార్మోగింది. 15 వందల మంది రుత్విజుల ఏక కంఠ పారాయణంతో క్రతువును కొనసాగించారు. సీఎం కేసీఆర్ దంపతులు, గవర్నర్ దంపతులతోపాటు భక్తులు అమ్మవారిని కొలుస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. చివరి రోజు కావడంతో యాగశాలకు లక్ష మంది వరకు భక్తులు చేరుకున్నారు.


« PREV
NEXT »

No comments

Post a Comment