తాజా వార్తలు

Tuesday, 15 December 2015

అటకెక్కిన స్వచ్ఛ్ భారత్-కేజ్రీవాల్

మోదీ ప్రభుత్వంపై యువతకు రానురాను విశ్వాసం సన్నగిల్లుతోందని  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  చెప్పారు. లోక్ సభ ఎన్నికలకు ముందు విదేశాల్లో ఉన్న నల్లధనం మొత్తాన్ని తిరిగి భారత్ కు తెప్పిస్తామన్న మోదీ.. అధికారంలోకి వచ్చాక మాత్రం యోగా చేయమంటున్నారని ఆరోపించారు. ఎలాంటి ఫలితం ఇవ్వని స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రచారం కోసం కోట్ల రూపాయలు వెచ్చించారని విమర్శించారు. దీనివల్ల కనీసం ఒక్క వీధి కూడా శుభ్రంగా కనిపించడంలేదని కేజ్రీవాల్ చెప్పారు. బీహార్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మోదీ ప్రభుత్వం విమర్శలు చేశారు. ఇదే వేధిక నుంచి ఢిల్లీలో రానున్న కాలంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని పరోక్షంగా చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment