తాజా వార్తలు

Monday, 21 December 2015

‘దో లఫ్జోన్ కీ కహానీ’లో అందురాలిగా...

‘దో లఫ్జోన్ కీ కహానీ’లో కాజల్  అంధురాలిగా నటిస్తున్నారు. ‘ఇప్పటివరకూ చేసిన పాత్రలు ఒక ఎత్తు.. హిందీ చిత్రం ‘దో లఫ్జోన్ కీ కహానీ’లో చేస్తున్న పాత్ర మరో ఎత్తు’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. ఈ పాత్ర చిత్రీకరణ ఆరంభించే ముందు వర్క్‌షాప్‌లో పాల్గొన్నానని కాజల్ తెలిపారు. అలాగే, అంధుల పాఠశాలలకు వెళ్లి, వాళ్ల హావభావాలు, శారీరక భాషను ఆమె గమనించారు. ఈ పాత్రను సవాల్‌గా తీసుకున్నానని కాజల్ చెబుతూ - ‘‘ఇందులో నేను శిల్పిగా నటిస్తున్నాను. నా పాత్ర పేరు జెన్నీ. హృదయానికి హత్తుకునే ప్రేమకథతో సాగే చిత్రం ఇది. కచ్చితంగా నాకు మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కాజల్ నటించిన కొన్ని చిత్రాలు చూసి, ఈ చిత్రంలో జెన్నీ పాత్రకు తనే కరెక్ట్ అని నమ్మాననీ, నా నమ్మకాన్ని ఆమె నిజం చేస్తోందని చిత్రదర్శకుడు దీపక్ తిజోరీ పేర్కొన్నారు. ఇది ప్రేమకథా చిత్రం కాబట్టి, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment