తాజా వార్తలు

Tuesday, 29 December 2015

జనవరి 8న ''కవ్వింత''

'కవ్వింత'. చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 8న విడుదలకు సిద్ధంగా ఉంది. అంజనీ మూవీస్ పతాకంపై విజయ్ దాట్లా, దీక్షాపంత్ జంటగా త్రిపురనేని విజయ్ చౌదరి దర్శకత్వంలో పువ్వల శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం 'కవ్వింత'.  ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో..
దర్శకుడు విజయ్ చౌదరి మాట్లాడుతూ.. ''ఫేక్ కరెన్సీ నేపధ్యంలో ఓ అందమైన విలేజ్ లో జరిగే ప్రేమ కథే ఈ సినిమా. ఫోటోగ్రఫీ, మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్స్ గా నిలుస్తాయి. మొత్తం 5 పాటలుంటాయి. అందరూ కష్టపడి వర్క్ చేశారు. జనవరి 8న ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడానికి కష్టమవుతున్న ఈ రోజుల్లో మా చిత్రానికి బయ్యర్స్ మంచి సపోర్ట్ ను అందిస్తున్నారు'' అని చెప్పారు.
మల్టీ డైమెన్షన్ వాసు మాట్లాడుతూ.. ''ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రాంతాల వారీగా ఈ చిత్రాన్ని సేల్ చేశారు. లాభనష్టాలను అందరూ సమానంగా పంచుకోవాలనే నూతన పద్ధతిని అనుకరిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 67 సెంటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు 
త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ.. ''కొత్త ప్రయోగం చేయాలనే తపనతో డైరెక్టర్ ఈ సినిమా చేశాడు. సామాన్యుడు సైతం పంపిణీదారుడు అవ్వచ్చనే ఉద్దేశ్యంతో ఏరియాల వారిగా సినిమాను అమ్మకానికి పెట్టారు. చక్కటి పాయింట్ తో సినిమా రూపొందించారు'' అని చెప్పారు.
విజయ దాట్లా మాట్లాడుతూ.. ''సినిమా మొదలు పెట్టిన రోజు నుండి అందరం కష్టపడి వర్క్ చేశాం. జనవరి 8న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి థాంక్స్'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ధనరాజ్, అంబటి శ్రీను, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మాటలు: నివాస్, లిరిక్స్: చైతన్య వర్మ, కెమెరా: కార్తిక్ ఘట్టమనేని, శ్యాం తుమ్మలపల్లి, సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటింగ్: మధు. జి. రెడ్డి,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి ప్రకాష్ నంది, సహా నిర్మాత: తెంటు లక్ష్ము నాయుడు,  నిర్మాత: పువ్వల శ్రీనివాసరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విజయ్ చౌదరి త్రిపురనేని.
« PREV
NEXT »

No comments

Post a Comment