తాజా వార్తలు

Monday, 14 December 2015

అఖిల్ తో ఐతే రెడీ...

తెలుగు పరిశ్రమలో ఉన్న హీరోలందరి సరసన నటించాలని ఉందని, కానీ అఖిల్ తో ఛాన్స్ వస్తే వదులు కోనని తేల్చేసింది అందాల రాక్షసి లావణ్య తిపాఠీ. నాగార్జున గారి సరసన నటించాను. ‘మనం’లో నాగచైతన్యకు ఫ్రెండ్‌గా చేశాను. చైతన్య సరసన నటించే అవకాశం వస్తే, తప్పకుండా చేస్తాను. ‘బాహుబలి-2’లో నటిస్తున్నాననే వార్త వస్తోంది. కానీ, నాకా అవకాశం రాలేదు. ఒకవేళ రాజ మౌళి గారు అవకాశం వస్తే ఎందుకు కాదంటాను. ఆయన అడిగితే బ్యాక్‌గ్రౌండ్‌లో నిలబడి నటించడానికైనా వెనకాడను. ‘హైదరాబాద్ నాకు చాలా నచ్చింది. అందుకే ఇక్కడ ఇల్లు కొనుక్కోవడానికి ప్లాన్ చేస్తున్నా’’ అని ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్యా త్రిపాఠీ అన్నారు. ‘భలే భలే మగాడివోయ్’ సక్సెస్. ప్రస్తుతం చేతిలో ఉన్నవన్నీ మంచి సినిమాలే. నాగార్జునగారి సరసన నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ త్వరలో విడుదల కానుంది. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’లో మూడు కోణాలున్న పాత్ర చేశాను. అల్లు శిరీష్ సరసన నటిస్తున్న చిత్రంలో కాలేజీ గర్ల్‌గా చేస్తున్నాను.  ఏ సినిమా చేసినా ముందు కథ, ఆ తర్వాత దర్శకుడు, నా పాత్ర గురించి ఆలోచిస్తాను. వరుసగా సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ఇటీవల కొంత గ్యాప్ తీసుకుని ఇండొనేసియా వెళ్లొచ్చాను. ఆ హాలిడే ట్రిప్ చాలా ఎంజాయ్‌మెంట్ ఇచ్చింది. ఫుల్‌గా రిలాక్స్ అయ్యి, వచ్చాను. దాంతో నూతనోత్సాహంతో షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను.  
« PREV
NEXT »

No comments

Post a Comment