తాజా వార్తలు

Friday, 4 December 2015

మేడారం జాతరకు రెడీ అవుతున్న తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్టు చేస్తున్నది.  మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు సర్వ సన్నద్ధమైంది. ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారక్క జాతర కోసం సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతర కోసం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి చందులాల్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతరను ఘనంగా  నిర్వహించేందు, తదితరఅంశాలపై చర్చించి నిధుల కేటాయింపులు చేశారు.. 
« PREV
NEXT »

No comments

Post a Comment