తాజా వార్తలు

Sunday, 13 December 2015

గోళ్లు కొరుకుడు అలవాటు ఉన్నవాళ్లు సరికొత్త ఆలోచనపరులట

గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారికి శుభవార్త. ఒత్తిడిలో ఉన్నప్పుడు చాలామంది విపరీతంగా గోళ్లు కొరుకుతుంటారు. పెద్దవాళ్లు మాత్రం ఇది మంచి అలవాటు కాదు అంటూ హెచ్చరిస్తుంటారు. అయితే ఒత్తిడిలో ఉన్నప్పుడు గోళ్లు కొరకడం వల్ల ఒత్తిడి తగ్గిపోయి సరికొత్త ఆలోచనలు, చేసే పనిలో నైపుణ్యం వస్తాయట. కొంతమందేమో వెంట్రుకలు సవరించుకోవడం, లేదంటే దువ్వుకోవడం, జుట్టు పీక్కోవడం, మెటికలు విరవడం లాంటివి చేస్తుంటారు. అయితే ఈ ముగ్గురి కంటే గోళ్లు కొరుక్కునే వారే ఒత్తిడిలోంచి, బాధ లోంచి తొందరగా బయటపడతారని, లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటారని ఈ పరిశోధనలో తేలింది. ఒత్తిడి, రిలాక్స్, నిరాశ లాంటి మూడు రకాల ఫీలింగ్స్‌లో ఉన్న 48 మందిని సమీకరించి వారిచేత గోళ్లు కొరికించి వారిలో ఎవరు పర్ఫెక్షనిస్టులో తేల్చి చెప్పారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment