తాజా వార్తలు

Sunday, 20 December 2015

నిర్భయ బాల నేరస్తుడి విడుదల

ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరుస్తుడు ఆదివారం బాల నేరస్తుల సంరక్షణ గృహం నుంచి విడుదలయ్యాడు. నిర్భయ దోషి విడుదలను వ్యతిరేకిస్తూ, అతడికి మరణశిక్ష విధించాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో ఆదివారం కూడా నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. బాల నేరస్తుడి పునరావాసం కోసం రూ. 10 వేలు, కుట్టుమిషన్ అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. విడుదలైన తరువాత ఎక్కడికెళ్లాలనుకుంటున్నావన్న ప్రశ్నకు.. సొంత ప్రాంతమైన యూపీలోని బదాయూకు వెళ్తే తన ప్రాణాలకు ప్రమాదముందన్న భయాన్ని ఆ బాల నేరస్తుడు వ్యక్తపరిచాడని, అందువల్ల అతడి కోరిక మేరకు ఒక ఎన్జీవోకు అప్పగించామని పోలీసు వర్గాలు తెలిపాయి.  గ్యాంగ్ రేప్ బాధితురాలు జ్యోతి సింగ్ తల్లిదండ్రులు, పలువురు సామాజిక కార్యకర్తలు ఈ ‘నిర్భయ’ దోషి విడుదలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జ్యోతి సింగ్‌పై అమానుష అత్యాచారానికి పాల్పడిన ఆరుగురిలో అత్యంత పాశవికంగా ప్రవర్తించిన వ్యక్తికి.. కేవలం బాల నేరస్తుడన్న కారణంగా మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించి, విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. పరివర్తన చెందేందుకు అవకాశమివ్వాలంటూ విడుదలను మరి కొందరు సమర్ధించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment