తాజా వార్తలు

Wednesday, 2 December 2015

క్రికెట్ ను కాపాడుకోవాలి: ద్రవిడ్

భారత్ లో క్రికెట్ కు ప్రాధాన్యం తగ్గింది. మిగతా క్రీడలవైపు న్యూ జనరేషన్ లుక్కేసింది. దేశంలో క్రికెట్ ఫ్యూచర్ కోసం బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి. సపోర్ట్ లేనిదే.. మాస్టర్ అంతటివాడయ్యేవాడు కాదు. ఇవీ టీమిండియా జూనియర్ క్రికెట్ కోచ్.. రాహుల్ ద్రవిడ్ కామెంట్స్. మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారక ఉపన్యాసంలో ద్రవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

భారత్ లో క్రికెట్ మతం. క్రికెటర్లు దేవుళ్లు. ఇది ఒకప్పటి మాట. ఇపుడా పరిస్థితి మారింది. మిగతా క్రీడలవైపు కొత్త తరం ఫోకస్ చేస్తోంది. ఇదే విషయాన్ని తనదైన శైలిలో చెప్పాడు జూనియర్ క్రికెట్ కోచ్ రాహుల్ ద్రవిడ్. కొత్తతరం మిగతా క్రీడలవైపు చూస్తోందని.. అది మంచిదే అయినా… భారత క్రికెట్ భవిష్యత్తు కోసం జూనియర్ స్థాయిలో ఆటను అభివృద్ధి చేసేందుకు బీసీసీఐ చొరవ చూపాలన్నాడు ద్రవిడ్.  జూనియర్ క్రికెట్ కోసం స్పెషల్ గా… బ్లూప్రింట్ ను రెడీ చేయాలన్నది వాల్ అభిప్రాయం. మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారక ఉపన్యాసంలో ద్రవిడ్ కీలక అంశాలపై తన అభిప్రాయాలు చెప్పాడు.

దేశవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ అకాడమీలు… కొత్త తరానికి క్రికెట్ ను దూరం చేస్తున్నాయన్నాడు మిస్టర్ డిపెండబుల్. ఏటా 30 కోట్ల వరకు తీసుకునే రాష్ట్ర క్రికెట్ సంఘాలు కొంత మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీ కోచింగ్ కు కేటాయించాలని సూచించాడు. దాంతో పేద క్రీడాకారులకు మేలు జరుగుతుందన్నాడు.

స్కూల్ స్థాయి క్రికెట్ లోనే… సబ్ స్టిట్యూషన్, రొటేషన్ పద్ధతిలో ఆటగాళ్లకు ఛాన్సిస్తే టాలెంట్ బయటకొస్తుందని గుర్తు చేశాడు ద్రవిడ్. అండర్-14 స్థాయిలో రాణించకపోతే కెరీర్ అయిపోయినట్టేనని భావించొద్దని.. పేరెంట్స్, ఫ్యామిలీ సపోర్టే కీలకమని సజెస్ట్ చేశాడు. అదే లేకపోతే సచిన్… వరల్డ్ బెస్ట్ క్రికెటర్ అయ్యేవాడు కాదన్నాడు.

ఇక క్రికెట్ లో అందరూ సచిన్ తో పోల్చుకుని.. స్ట్రెస్ ఫీలవ్వొదన్నాడు ద్రవిడ్. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయసు తక్కువగా చూపించడం కూడా ఫిక్సింగ్  లాంటి జాడ్యమే నని… క్రికెట్ లో ఎదిగేందుకు షార్ట్ కట్స్ ఉండవన్నాడు. కఠిన నిబంధనలతో బోర్డు దీనికి అడ్డుకట్ట వేయాలని సూచించాడు. పటౌడీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment