తాజా వార్తలు

Tuesday, 1 December 2015

టిడిపిలో చేరిన ఆనం సోదరులు

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిలు తెలుగుదేశంలో ప్రవేశించారు.విజయవాడో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో వారు టిడిపిలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎపి టిడిపి అద్యక్షుడు కళా వెంకటరావు, మంత్రి నారాయణ, నెల్లూరు కు చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు. కొద్ది రోజుల తర్వాత ఆనం సోదరుల చేరికను పురస్కరించుకుని నెల్లూరులో బారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు.

 టిడిపిలో చేరిన ఆనం వివేకనందారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు..తండ్రిపేరును జగన్ చెడగొట్టారని ఆరోపించారు..వైఎస్ పేరు చెప్పుకునే అర్హత జగన్ కు లేదని విమర్శించారు..వైసిపిలో చేరికపై ఓ విలేకరి ప్రశ్నించగా రౌడీల పార్టీలో చేరడమా అంటూ ఎదురు ప్రశ్నించారు...త్వరలో వైసిపికి చెందిన చాలామంది నేతలు టిడిపిలో చేరబోతున్నారని వ్యాఖ్యానించారు..ఎపిని అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకే ఉందని, సిఎంకు మద్దతుగా నిలబడేందుకే టిడిపిలో చేరామని తెలిపారు..కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీలో చేరామని తెలిపారు..టిడిపి అభివృద్ధికి పాటుపడతామని, సామాన్యకార్యకర్తగా పనిచేస్తామని తెలిపారు..పదవులు ఆశించి టిడిపిలో చేరలేదని వ్యాఖ్యానించారు..
« PREV
NEXT »

No comments

Post a Comment