తాజా వార్తలు

Friday, 25 December 2015

ఓ మై గాడ్...

తనీష్, మేఘశ్రీ, పావని ప్రధానపాత్రల్లో శ్రీ వెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం ' మై గాడ్'. వి.శ్రీవాత్సవ్ దర్శకుడు. చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2016 జనవరి 8 విడుదలకు సిద్ధంగా ఉంది. సందర్భంగా..తనీష్ మాట్లాడుతూ.. ''రీసెంట్ గా సెన్సార్ కంప్లీట్ చేసుకున్నాం. జనవరి 8 సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సక్సెస్ తో కొత్త సంవత్సరం మొదలుపెట్టాలని జనవరిలో సినిమా రిలీజ్ చేస్తున్నాం'' అని చెప్పారు.
చిత్ర దర్శకుడు శ్రీవాత్సవ్ మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. అవుట్ పుట్ బాగా వచ్చింది. ఆర్టిస్టులు అందరు బాగా నటించారు. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. జనవరి 8 విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
నిర్మాత వేణు మాట్లాడుతూ.. ''ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ అందరు బాగా సపోర్ట్ చేసారు. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
మేఘశ్రీ మాట్లాడుతూ.. ''సినిమాలో కామెడీ, రొమాన్స్, హారర్, థ్రిల్లర్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం'' అని చెప్పారు.
చిత్రానికి ఫోటోగ్రఫీ: రాజు తోట, ఎడిటింగ్: ఉపేంద్ర, మ్యూజిక్: రాజ్ కిరణ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రోషన్ సాలూరి, కో ప్రొడ్యూసర్: చనమాల పురుషోత్తం, నిర్మాత: వేణు ముక్కపాటి, దర్శకుడు: శ్రీవాత్సవ్

« PREV
NEXT »

No comments

Post a Comment