తాజా వార్తలు

Saturday, 19 December 2015

గోపీచంద్‌ - ఆక్సిజన్‌

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్న 'ఆక్సిజన్‌' చిత్రం షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో ఈరోజు చెన్నయ్‌లోని శ్రీవిశ్వరూపా సాయిబాబా టెంపుల్‌లో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో హీరో గోపీచంద్‌, డైరెక్టర్‌ జోతికృష్ణ, నిర్మాణ పర్యవేక్షకులు ఎ.ఎం.రత్నం, నిర్మాత ఎస్‌.ఐశ్వర్య, సినిమాటోగ్రాఫర్‌ వెట్రి పాల్గొన్నారు. 
ఈ చిత్రం గురించి దర్శకుడు జోతికృష్ణ తెలియజేస్తూ - ''ఇది ఒక ఫాస్ట్‌ పేస్డ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈరోజు పూజా కార్యక్రమాలతో మా 'ఆక్సిజన్‌' చిత్రాన్ని ప్రారంభించాము. ఈ చిత్రంలో జగపతిబాబుగారు ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. జనవరి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది'' అన్నారు. 
ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌, జగపతిబాబు, కిక్‌ శ్యామ్‌, రాశిఖన్నా, అను ఇమ్మానుయేల్‌, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌: సిల్వ, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాణ పర్యవేక్షణ: ఎ.ఎం.రత్నం, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ. 
« PREV
NEXT »

No comments

Post a Comment