తాజా వార్తలు

Thursday, 3 December 2015

ఓయూలో 'పెద్ద కూర'ల పంచాయతీ

బీఫ్‌ ఫెస్టివల్‌పై రగడ రోజు రోజుకూ ముదురుతోంది. అడ్డుకుంటామని హిందూ సంస్థలు ప్రకటిస్తే...నిర్వహించి తీరుతామని అభ్యుదయ, సామాజిక విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.ఉస్మానియాలో బీఫ్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వరాదని ఉస్మానియ యూనివర్శిటీ అదికారులు నిర్ణయించినట్లు కదనం.ఈ వివాదంలోకి బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రావడంతో ఉద్రికత్తలు పెరిగే ప్రమాదం ఉన్నందున ఇలాంటి ఉత్సవాలకు అవకాశం ఇవ్వరాదని అదికారులు బావిస్తున్నట్లు చెబుతున్నారు.పోలీసులు సైతం ఇది పెద్ద శాంతి బద్రతల సమస్య అవుతుందని భావిస్తున్నారు. అధికారులు అనుమతి ఇవ్వకపోతే విద్యార్ధి సంఘాలు ఏమి చేస్తాయన్న ప్రశ్న వస్తుంది.తాము ఇప్పటికే వంద కిలోల మాంసానికి ఆర్డర్ ఇచ్చామని, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీహారు నేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆహ్వానాలు పంపామని, ఎలాగైనా ఉత్సవం జరుపుతామని దీనిని నిర్వహించతలపెట్టిన విద్యార్ది సంఘాలు చెబుతున్నాయి.డిసెంబర్ పదిన ఈ కార్యక్రమం తలపెట్టారు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ విద్యార్దులకు హితబోధ చేశారు. యూనివర్శిటీలు విజ్క్షాన కేంద్రాలు గా ఉండి విజ్ఞాన ఉత్సవాలు జరుపుకోవాలి కాని, బీఫ్ ఉత్సవాలు కాదని ఆయన అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ పెస్టివల్ జరుపుతామని కొన్ని విద్యార్ది సంఘాలు ప్రకటించిన నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.యూనివర్శిటీలలో అనవసర రాజకీయాలు తగవని అన్నారు. ఏమి తినదలచుకున్నా, సొంత ఇళ్లలో తినవచ్చని, లేదా షాదీఖానా వంటి చోట్ల కార్యక్రమాలు జరుపుకోవచ్చని ఆయన అన్నారు.అనవసంరగా యూనివర్శిటీలలో ఉద్రిక్తతలు తేరాదని ఆయన సలహా ఇచ్చారు.

మరోపక్క బీఫ్ పెస్టివల్‌కు పోటీగా ఈ నెల 10న ఓయూ జేఏసీ, పోర్క్ ఫెస్టివల్‌ను, గిరిజన జేఏసీ బోటీబాటీ సలాయ్‌ అనే కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఐతే తాము బీఫ్‌ పెస్టివల్‌కు వ్యతిరేకంగా కాదని, అలాగని మద్దతు కూడా ఇవ్వడం లేదని పోర్క్ ఫెస్టివల్‌ నిర్వాహకులు చెబుతున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment