తాజా వార్తలు

Saturday, 19 December 2015

కోలుకుంటున్న రోజా

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు నిమ్స్ లో రోజాను పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే అనారోగ్యంతో రోజా 9 రోజుల పాటు స్విమ్స్ లో చికిత్స పొందిందని వైఎస్ జగన్ తెలిపారు. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సూచించినట్లు  చెప్పారు.  రోజాకు హైబీపీ ఎక్కువగా ఉందని, ఆరోగ్యం కుదుటపడుతుందని డాక్టర్లు చెప్పారని వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పోలీసుల అత్యుత్సాహంతో రోజా కింద పడిపోయి గాయాలయ్యాయి. సొమ్మసిల్లి పడిపోయిన పట్టించుకోకుండా పోలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైఎస్ జగన్ స్టేషన్ కు చేరుకొని రోజాను పరామర్శించి ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి చికిత్స కోసం నిమ్స్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment