తాజా వార్తలు

Wednesday, 2 December 2015

హంతకులను విడుదల చేయడానికి మీరెవరు..

హంతకులను విడుదల చేయడానికి మీరెవరని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురకలు అంటించింది. రాజీవ్ హంతకులను తమిళనాడు ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించినప్పడు అప్పటి యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువరించింది. వారి విడుదలపై స్టే విధించింది. కేంద్రం అనుమతి లేనిదే వారి విడుదలపై నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పింది. వారి విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని ఆదేశించింది.  దీంతో రాజీవ్ హంతకుల విడుదలపై తమిళనాడు వెనక్కి తగ్గాలని నిర్ణయించినట్టు టాక్. 
« PREV
NEXT »

No comments

Post a Comment