తాజా వార్తలు

Wednesday, 2 December 2015

శ్రీనువైట్లతో భళ్లాలదేవ?

'బాహుబలి'లో భళ్లాలదేవగా మెప్పించాడు రానా దగ్గుబాటి. 'రుద్రమదేవి'లోనూ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ఇప్పుడు 'బాహుబలి 2' తో బిజీ కాబోతోన్నాడు. అయితే సోలో కథానాయకుడిగా ఓ మాస్‌ సినిమాచ చేయాలన్నది రానా ఆలోచన. అందుకోసం కథలు కూడా వింటున్నాడు. ఇప్పుడు శ్రీనువైట్ల రానా కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నట్టు టాక్‌. 'ఆగడు', 'బ్రూస్లీ' వైఫల్యాలతో దర్శకుడిగా ఓ అడుగు వెనక్కి వేశాడు శ్రీనువైట్ల. ఎలాగైనా సరే... ఈసారి హిట్టు కొట్టాలన్న కసితో ఓ కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ కథ రానాకైతే బాగుంటుందన్నది శ్రీను ఆలోచన. ఇటీవల రానాని కలసి లైన్‌ కూడా చెప్పి ఓకే చేయించుకొన్నాడట. అతి త్వరలో ఈ కాంబినేషన్‌పై ఓ స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment