తాజా వార్తలు

Thursday, 3 December 2015

రాజ‌మౌళి ఈగ‌.. మ‌రి రవిబాబు..??

హాలీవుడ్ లో ఓ జంతువుని మెయిన్ పాత్రలో పెట్టి సినిమాలు తీసి కోట్లు కొల్లగొడుతూ ఉంటారు. ఇక మన తెలుగులో స్టార్ దర్శకుడు రాజమౌళి అతి చిన్న ప్రాణి ఈగను మెయిన్ పాత్రలో పెట్టి సినిమా తీశాడు. ఔరా అని పించి హిట్ కొట్టాడు. కాగా ఇప్పుడు రాజ మౌళి బాటలో మరో టాలీవుడ్ నటుడు కమ్ దర్శకుడైన రవిబాబు నడిచే ప్లాన్ లో ఉన్నాడట. జంతువుని గ్రాఫిక్ లో సృష్టించి దానిని మెయిన్ పాత్రగా పెట్టి ఇతర నటీనటులతో ఓ సినిమా తీసే ప్లాన్ రవిబాబు చేస్తున్నాడట. కానీ ఆ మెయిన్ పాత్రలో నటించే జంతువు ఏదనేది ఇంకా రవిబాబు రిలీవ్ చెయ్యలేదు. రవి బాబు సినిమాలంటే డిఫరెంట్ గా కాస్త క్రియేటివ్ టీ తో ఉంటాయి కనుక ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని సినీ వర్గాల టాక్. 
« PREV
NEXT »

No comments

Post a Comment