తాజా వార్తలు

Thursday, 3 December 2015

సత్ ప్రవర్తనతో ఆరు నెల ముందే జైలు నుంచి మున్నాబాయ్ బయటకు..?

సత్ప్రవర్తనతో ఆరు నెల ముందే జైలు నుంచి మున్నాబాయ్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ పత్రిక వార్త పత్రిక కథనం ప్రచురించింది. ప్రస్తుతం ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది. ఆయనను శిక్షాకాలం గడువు కన్నా దాదాపు ఆరు నెలలు ముందే విడుదలే చేసే అవకాశముందని ఓ మహారాష్ట్ర దినపత్రిక తెలిపింది. జైల్లో మున్నాభాయ్ సత్ప్రవర్తనే అందుకు కారణమట. జైలుశిక్షాకాలంలో ఖైదీ సత్ప్రవర్తనతో వ్యవహరిస్తే అతనికి 114 రోజులపాటు శిక్షను తగ్గించే అవకాశముంది. 
జైలు నిబంధనలకు సంబంధించిన ఓ క్లాజు ప్రకారం ఖైదీ ప్రవర్తన బాగుంటే అతనికి మూడు రోజులు సెలవు ఇస్తారు. అదేవిధంగా తాను ఎంచుకున్న వృత్తిలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే నాలుగు రోజుల వరకు సెలవు పొందే అవకాశముంది.  ఈ లెక్కన ఓ నెలలో ఏడురోజుల వరకు సెలవు పొందవచ్చు. అంతేకాకుండా ఒక ఏడాదికాలంలో ఖైదీ ఆదర్శప్రాయమైన ప్రవర్తన కనబరిస్తే అతనికి 30రోజల వరకు సెలవు ఇవ్వవచ్చు. ఈ సెలవు 30 రోజులా లేక 60 రోజులా లేక 10 రోజులా అన్నది నిర్ణయించే అధికారం జైలు సబ్ సూపర్ వైజర్, చీఫ్ సూపర్ వైజర్, సీనియర్ పోలీసుల అధికారుల చేతిలో ఉంటుంది. సంజయ్ దత్ విషయంలో ఈ మేరకు చట్టాల్లో ఉన్న ఓ క్లాజును ఎరవాడ జైలు అధికారులు పరిశీలిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది.
« PREV
NEXT »

No comments

Post a Comment