తాజా వార్తలు

Monday, 7 December 2015

రాజ్యసభలో మౌనం వీడిన మాస్టర్

రాజ్యసభలో సచిన్ టెండూల్కర్  మౌనాన్ని వీడారు.  2012 జూలై 3న రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన సచిన్ తొలిసారి తన సొంత నగరమైన ముంబైపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ముంబై మెట్రో రైల్వేను ప్రత్యేక జోన్‌గా ఎందుకు ప్రకటించలేరని ఆయన రైల్వే శాఖను ప్రశ్నించారు. కోల్‌కత్తా మెట్రోను ప్రత్యేక రైల్వే జోన్‌గా ప్రకటించిన తరహాలోనే ముంబైతో పాటు ఢిల్లీ, చెన్నై మెట్రోలను ఎందుకు ప్రత్యేక జోన్లుగా ప్రకటించ లేరని సచిన్ తన లేఖలో ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటిస్తారని సచిన్ అడిగారు. మూడు నగరాల్లో ఉన్న మెట్రో ప్రమాణాలు వాటిని ప్రత్యేక జోన్లుగా గుర్తించే అవకాశం ఉందా లేదా అని ప్రశ్నించారు. లెజండ్ క్రికెటర్ అడిగిన ప్రశ్నకు రైల్వే సహాయమంత్రి మనోజ సమాధానం ఇచ్చారు. భారతీయ రైల్వేకు అనుసంధానమైన కోల్‌కతా మెట్రో సర్వీసులు భిన్నమైనవని మంత్రి తెలిపారు. మూడు మహా నగరాల్లో మెట్రో రైల్వే సర్వీసులు మెయిన్‌లైన్లతో అనుసంధానమై ఉంటాయని, కానీ కోల్‌కత్తాలో మాత్రం కేవలం మెట్రో సేవలే ఉంటాయని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment