తాజా వార్తలు

Thursday, 3 December 2015

అప్పుడు 7 కోట్లు, ఇప్పుడు 70 లక్షలు!

అక్కినేని మూడోతరం చివరి వారసుడిగా వెండితెర హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలిసినిమా అఖిల్.. దీపావళి కానుకగా రిలీజై అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది. దీంతో చిత్ర నిర్మాత హీరో నితిన్ భారీ నష్టాన్ని చవిచూశాడు. ఇక అఖిల్ శాటిలైట్ రైట్స్ అయినా అమ్మి కాస్త నష్టాన్ని భర్తీ చేసుకుందామని అనుకున్న నిర్మాతకు చుక్కెదురైంది. సినిమా రిలీజ్ కు ముందు అఖిల్ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం జెమిని టీవీవారు రూ. 7 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ ఇవ్వగా... నితిన్ తండ్రి రూ. 8 కోట్లయితే ఇస్తామని లేదంటే వేరే ఛానల్ వారికి అమ్మేస్తానని బెట్టు చేశాడు. కానీ అఖిల్ సినిమా టాక్ తో జెమిని సినిమా కోనే విషయం లో వెనకడుగేసింది. దీంతో సుధాకర్ రెడ్డి స్వయంగా జెమినీ సంస్థ ఎండిని కలిసి రెండు కోట్లకైనా అఖిల్ ని ఇస్తానని చెప్పాడట. కానీ జెమినీ వారు అఖిల్ రూ.70 లక్షల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వమని చెప్పారట. దీంతో అప్పుడు రూ. 7 కోట్లు.. ఇప్పుడు రూ. 70 లక్షలు అని వి వి వినాయక్ సినిమా దిల్ లో డైలాగ్ గుర్తుకు చేసుకుంటున్నారు సినీ జనం... 
« PREV
NEXT »

No comments

Post a Comment