తాజా వార్తలు

Thursday, 3 December 2015

శంకరాభరణం రివ్యూ


సినిమా అంతా బిహార్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది. ఐనా అన్ని క్యారెక్టర్లు తెలుగులోనే మాట్లాడతాయి.   నిఖిల్  న్యూయార్క్‌లో ఆనందంగా జీవితం గడుపుతున్న కుర్రాడు. తన తండ్రికి వచ్చిన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు 25 ఏళ్ల క్రితమే వదిలేసి వచ్చిన తల్లి ఆస్తిని అమ్మడానికి ఇండియాకు వస్తాడుబిహార్లోని పాట్నా సమీపంలో తన తల్లి పేరున ఉన్న శంకరాభరణం ప్యాలెస్‌ను అమ్మి డబ్బుతో తండ్రి సమస్యలను తీర్చేయాలనుకుంటాడు. అదే ప్యాలెస్‌లో నివాసం ఉంటున్న గౌతమ్ తల్లి కుటుంబసభ్యులు, ఆమె తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని ద్వేషిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాకు వచ్చిన గౌతమ్‌కు తన తండ్రి చిన్ననాటి స్నేహితుడి కొడుకు సప్తగిరి సాయంగా వస్తాడు. ఇద్దరు కలిసి ప్యాలెస్‌లో ఉంటున్నవారిని ఎలాగైనా మోసం చేసి ప్యాలెస్ అమ్మేయాలని ప్లాన్ చేసుకుంటారు. అదే సమయంలో ఇంట్లో జరుగుతున్న శుభకార్యంలో పాల్గొన్న గౌతమ్, అనుబంధాల విలువ తెలుసుకొని పని చేయలేకపోతాడు. అప్పటికే బిహార్‌లో భారీగా ఆస్తులున్న ఎన్నారై అడుగుపెట్టడాన్న వార్త అక్కడున్న కిడ్నాపర్ గ్యాంగ్‌లకు తెలిసిపోతుంది. చేతిలొ చిల్లిగవ్వ కూడా లేని గౌతమ్‌ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు ఏమయ్యారు, గౌతమ్ వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు. చివరకు తనకు కావాల్సిన డబ్బును ఎలా సంపాదించాడు అన్నదే మిగతా కథ.
సినిమా విషయానికి వస్తే..కొన్ని సన్నివేశాల్లో డబ్బింగ్ సినిమా చూస్తున్నామా అన్ని ఫీల్ కలుగుతుంది. స్క్రీన్ ప్లే రచయితగా మంచి పేరున్న కోన వెంకట్, సినిమాలో మాత్రం స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకోలేకపోయాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమాలో ఫస్టాఫ్‌లో స్థాయి వేగం కనిపించదు. సెకండాఫ్ కాస్త ట్రాక్ ఎక్కినట్టు కనిపించినా, ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి సంబంధం లేకుండా మారిపోతుంటుంది. దీంతో ప్రేక్షకుడు సమయంలోనూ కథతో కనెక్ట్ అవ్వడు. సినిమా అంతా సో సోగా నడిపించిన కోన.. క్లైమాక్స్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకున్నాడు. హీరో ఆడే మైండ్ గేమ్ తో ఆఖరి 30 నిమిషాలు థ్రిల్లింగ్‌గా కథ నడిపించాడు. దీని కోసం సినిమా ఓ సారి చూడొచ్చు..
« PREV
NEXT »

No comments

Post a Comment