తాజా వార్తలు

Wednesday, 9 December 2015

ఐసీయూలో శంకర్ మహదేవన్

శంకర్ మహదేవన్ గుండెపోటుతో హాస్పిటల్ లో చేరారు . శంకర్ మహాదేవన్ ఆరోగ్య పరిస్ధితి బాగోలేదని తెలుసుకున్న వైద్యులు వెంటనే ఆయనను ఐ.సి..యులో చేర్చి ఈ.సి.జీ తీసారట. అంతేకాక ఈ ప్రముఖ సింగర్ ను రెండు రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉండాలనే సలహా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఓ హస్పిటల్ లో చికిత్స పొందుతున్న శంకర్ మహదేవన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే ఆయనను డిస్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. శంకర్ మహదేవన్ కుమారుడు సిద్ధార్ద్ మాట్లాడుతూ అలసట, ఒత్తిడి మూలంగానే నాన్న గారికి గుండెపోటు వచ్చిందని , మొదటి రోజే ఏంజియోప్లాస్టీకు పంపగా మేజర్ బ్లాకులు ఏమీ లేవని వైద్యులు నిర్ధారించారంటూ సిద్ధార్ద్ తెలిపారు .

« PREV
NEXT »

No comments

Post a Comment