తాజా వార్తలు

Thursday, 3 December 2015

సన్నీ డియోల్‌ చెంప పగలగొట్టింది..!

బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ నటుడు సన్నీ డియోల్‌పై చేయిచేసుకుంది. ఇదేదో అతనిపై కోపంతో చేసిన పని కాదండోయ్‌..! వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం 'ఘాయల్‌ వన్స్‌ అగేన్‌'. ఇందులోని ఓ సన్నివేశంలో సన్నీని సోహా కొట్టాల్సి ఉంది. కానీ సోహా మాత్రం సన్నీని నిజంగానే కొట్టింది. దీంతో అక్కడున్నవారందరూ నిర్ఘాంతపోయారు.అసలేం జరిగిందంటే... హీరోగా నటిస్తున్న సన్నీ డియోల్‌ భావోద్వేగాన్ని నియంత్రించుకోలేని స్థితిలో ఉంటాడు. అప్పుడు చిత్రంలో సైకియాట్రిస్ట్‌గా నటిస్తున్న సోహా అతడిని చెంపదెబ్బ కొట్టాలి. అయితే ఇద్దరూ పూర్తిగా సన్నివేశంలో నిమగ్నమై నటించడంతో సోహా కాస్త గట్టిగానే చెంపదెబ్బ కొట్టింది. అది చూసి అందరూ నిర్ఘాంతపోయినా సన్నీ మాత్రం పరిస్థితిని అర్ధం చేసుకుని సర్దిచెప్పాడట. ఆ తర్వాత సోహా కూడా తన ప్రవర్తనకి క్షమాపణలు చెప్పిందట.
« PREV
NEXT »

No comments

Post a Comment