తాజా వార్తలు

Wednesday, 23 December 2015

తెలంగాణలో టెట్ కు తొలగిన అడ్డంకులు

టెట్ పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెట్ నిర్వహణ మార్గదర్శకాలు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్‌గా ఐదుగురితో కమిటీ వేశారు. గైడ్‌లైన్స్‌లో టెట్ సెంటర్స్‌ను తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.  పరీక్షల సమయం రెండున్నర గంటలుగా నిర్ణయించారు. టెట్‌లో 150 మార్కుల చొప్పున పేపర్1, పేపర్2 ఉంటాయి. టెట్ అర్హత మార్కులు జనరల్ 60శాతం, బీసీ50శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40శాతం నిర్ణయించారు. టెట్ అర్హత సర్టిఫికెట్ కాలపరిమితి ఏడేళ్లుగా నిర్థారించారు. సిలబస్‌ను కూడా విడుదల చేసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment