తాజా వార్తలు

Saturday, 19 December 2015

సైకో టీచర్

కుకట్ పల్లి హైదర్ నగర్ లోని రవీంద్ర భారతి స్కూల్ లో దారుణం జరిగింది. LKG చదువుతున్న హరిణి అనే విద్యార్ధిని రెండు వేళ్లు తెగిపోయాయి. హోం వర్క్ చేయలేదని టీచర్ కొడుతుండగా భయంతో పరిగెత్తింది హరిణి. దీంతో ఒక్కసారిగా డోర్ వేయటంతో రెండు వేళ్ళు దానిలో ఇరుక్కున్నాయి. స్కూల్ యాజమాన్యం హరిణి పేరెంట్స్ కు విషయం చెప్పకుండా ఆయాతో ఇంటికి పంపించేశారు. అసలు విషయం తెలియడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లింది హరిణి తల్లి. వైద్య పరిక్షలు నిర్వహించిన తర్వాత రెండు వెళ్ళు తెగినట్లు డాక్టర్లు తేల్చారు. స్కూల్ యాజమాన్యం నిర్వాకంపై మండిపడుతున్నారు పేరెంట్స్. 
« PREV
NEXT »

No comments

Post a Comment