తాజా వార్తలు

Tuesday, 1 December 2015

రాష్ట్ర బీజేపీలో ముసలం

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో అసమ్మతి రగులుతున్నది. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిపై అదే పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తొలగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమిత్ షాకు లేఖ రాసినట్లు రాజాసింగ్ మంగళవారం హైదరాబాద్ లో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాలంటే అధ్యక్ష పదవిలో మరొకర్ని నియమించాలని ఆ లేఖలో అమిత్ షాను కోరినట్లు రాజాసింగ్ వివరించారు. రాజాసింగ్  లేఖకు కేంద్ర బీజేపీ ఏలా స్పందిస్తుందో వేచిచూడాలి. 
« PREV
NEXT »

No comments

Post a Comment