తాజా వార్తలు

Saturday, 26 December 2015

అడ్డుఅదుపు లేకుండ పోతున్న ఆకతాయిలు

ఆకతాయిల పనులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కిచిడీ లేదని విజయవాడ పంజా కూడలిలోని హోటల్లో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. వెయిటర్పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. ఈనెల 24 అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం అర్ధరాత్రి నలుగురు యువకులు పంజా కూడలిలోని హోటల్కు వచ్చారు. కిచిడీ తీసుకురమ్మని వెయిటర్ను ఆదేశించారు. లేదని చెప్పడంతో రచ్చ రచ్చ చేసి వెయిటర్పై దాడికి దిగారు. ఘటనలో వెయిటర్ ఈశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, మరో యువకుడు పరారీలో ఉన్నాడు. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నరు. 
« PREV
NEXT »

No comments

Post a Comment