తాజా వార్తలు

Saturday, 26 December 2015

‘వీలైతే ప్రేమిద్దాం’ డ్యూడ్..

వీలైతే ప్రేమిద్దాం అంటూ సరికొత్త సినిమాతో  వైజాగ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై నూతన నటీనటులతో విశాఖ థ్రిల్లర్‌ ‘వెంకట్‌’ దర్శకత్వంలో తేజ నిర్మిస్తోన్న మెసేజ్‌ ఓరియంటెడ్‌ ప్రేమకథా చిత్రం ‘వీలైతే ప్రేమిద్దాం’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 8న విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది.  
ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వెంకట్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది నాలుగు జంటల మధ్య నడిచే ప్రేమకథ. చక్కటి మెసేజ్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సకుటుంబ కథా చిత్రమిది. షకలక శంకర్‌ కామెడి ఈ చిత్రంలో చాలా బాగా పండింది. స్వర్గీయ ‘ఆకాష్‌’ అందించిన స్వరాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.  సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. నూతన సంవత్సర కానుకగా జనవరి 8 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అన్నారు.
పృథ్వి, తులసి, రాజు, శివ, యాంజలీన, శ్రావ్య, చంద్రకళ, నవీన్‌, పూర్ణిమ, శివన్నారాయణ, షకలక శంకర్‌, జబర్ధస్ట్‌ శ్రీను, రాజా శ్రీధర్‌, ఎఫ్‌ఎమ్‌ బాబాయ్‌, గోపరాజు రమణలతో పాటు విశాఖ నగరానికి చెందిన స్థానిక కళాకారులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌ పల్లా, సంగీతం: ఆకాష్‌(లేటు), ఎడిటింగ్‌: ఉపేంద్ర, డాన్స్‌: లుక్స్‌ రాజశేఖర్‌, శ్యామ్‌, ఆర్ట్‌: ఎస్‌. ఉత్తమకుమార్‌, ఛీప్‌ కో డైరెక్టర్‌: సురేష్‌. ఆర్‌, దర్శకత్వ పర్యవేక్షణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మూర్తి ఆడారి, సహనిర్మాత: బి. మంగమ్మ, ఎ. రామకృష్ణ, నిర్మాత: తేజ, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విశాఖ థ్రిల్లర్‌ ‘వెంకట్‌’.
« PREV
NEXT »

No comments

Post a Comment