తాజా వార్తలు

Wednesday, 2 December 2015

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుంటే కొత్త ఇబ్బందిని ఎదుర్కోవలసి రావచ్చు

మోటార్ సైకిల్ నడిపేవారు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుంటే కొత్త ఇబ్బందిని ఎదుర్కోవలసి రావచ్చు.ప్రాంతీయ రవాణ అధారిటీ కి చెందిన సాధికార కమిటీ ఈ విషయమై కొన్ని ఆలోచనలు చేసింది. వాటి ప్రకారం హెల్మెట్ లేని వాహనాల డ్రైవర్లను పోలీసులు కౌన్సెలర్ ల వద్దకు పంపవచ్చు. అక్కడ వారు దాదాపు నిర్భందంలో ఉన్నట్లే.నాలుగు గంటల పాటు వారు హెల్మెట్ గురించి బోధిస్తారు.చివరికి ఆ సుత్తి భరించడం కన్నా హెల్మెట్ పెట్టుకోవడం బెటర్ అనే అభిప్రాయం వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో అరవై లక్షల ద్విచక్ర వాహనాలు ఉంటే ,17 లక్షలకు పైగా హైదరాబాద్ లోనే ఉన్నాయి.ఆ తర్వాత అత్యధికం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది. అప్పుడు కొన్ని గొడవలు జరగడం, పోలీసులు అతిగా వ్యవహరించడం తో క్లాస్ పీకడాలు ఆపేశారు. ఇప్పుడు హైకోర్టు కూడా దీనిపై ఆదేశాలు ఇస్తుండడంతో తిరిగి క్లాసులు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment