తాజా వార్తలు

Sunday, 27 December 2015

ఏపీ కాపిటల్ వర్క్ స్పీడ్

వీలైనంత త్వరగా.. ఏపీ సెక్రటేరియట్ ను హైదరాబాద్ నుంచి.. విజయవాడకు షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది బాబు సర్కారు . వచ్చే ఆర్నెళ్లలో సచివాలయాన్ని అక్కడికి తరలిస్తామంటోంది. విజయవాడలో ముందుగా సచివాలయం బిల్డింగ్స్ నిర్మించే పన్లో పడ్డారు అధికారులు. భవనాలు నిర్మించి.. అడ్మినిస్ట్రేషన్ అక్కడ్నుంచే నడుపుతామంటున్నారు. అంతే కాదు… జిల్లాల వారీగా సర్కార్ సేవలపై ఫోకస్ చేశారు. జనవరి ఒకటి నుంచి ఉచిత హెల్త్ చెకప్స్ చేయనున్నారు. సీఎం చంద్రబాబు కూడా దీనిపై బానే కాన్సంట్రేషన్ పెట్టారు. అన్ని చెకప్ లు ఫ్రీగా చేస్తామంటున్నారు. మిగతా పథకాల విషయంలో కూడా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. అధికారులకు ఆర్డర్స్ చేశారు. వీలైనంత త్వరగా పరిపాలనను విజయవాడకి షిఫ్ట్ చేస్తామని అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ లో తెలియజేశారు ఏపీ సీఎం. సర్కార్ సర్వీస్ లపై గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ చేశారు. కిందిస్థాయి సిబ్బందిని అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక రెండు రకాల రేషన్ కార్డులిచ్చేందుకు ముందుకెళ్తోంది ఏపీ సర్కార్. ఒక కార్డుతో.. రేషన్ తో పాటు, ప్రభుత్వ పథకాలు అందేలా చూడ్డం. రెండో రకం కార్డుతో.. రేషన్ లేకుండా ప్రభుత్వ పథకాలు మాత్రమే అందనున్నాయి. నవ్యాంధ్ర నిర్మాణమే మన కర్తవ్యం అనే నినాదంతో.. సంక్రాంతికి ఊరూరా ఉత్సవాలు కూడా చేసేందుకు ప్లాన్ చేస్తోంది ఏపీ గవర్నమెంట్. జూన్ లోగా 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనాలు నిర్మించి సచివాలయం మొత్తాన్ని అక్కడికి తరలించే పనిలో పడింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment