తాజా వార్తలు

Tuesday, 22 December 2015

అయుత చండీయాగానికి సర్వం సిద్ధం

అయుత చండీయాగం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అందరూ ఆహ్వానితులే..చండీయాగానికి ముందు జరిగే క్రతువులను సీఎం కేసీఆర్ దంపతులు పూర్తి చేశారు.  హైదరాబాద్ వైపు నుంచి ఎర్రవల్లి చండీయాగానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గౌరారం వద్ద రాజీవ్హ్రదారిపై ప్రత్యేక స్వాగత ద్వారాన్ని నిర్మించారు. అక్కడి నుంచి యాగశాల వరకు వెలుగులు విరజిమ్మే విద్యుత్ లైట్లు వేశారు. సికింద్రాబాద్ నుంచి గౌరారం స్వాగత ద్వారం వరకు ప్రతి కిలోమీటరుకు ఓ చోట యాగశాలకు దారిచూపే బోర్డులను ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, సాధారణ ప్రజల వాహనాల కోసం వేరువేరుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. యాగశాలకు కొద్ది దూరంలోని వెంకటాపూర్ వద్ద మూడు హెలీప్యాడ్‌లు నిర్మించారు. కరీంనగర్, సిద్దిపేట వైపు నుంచే వచ్చే సందర్శకుల కోసం ప్రజ్ఞాపూర్ నుంచి జగదేవ్‌పూర్ రోడ్డులోని ఎర్రవల్లికి వెళ్లే రహదారి వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. గణేశ్‌పల్లి వద్ద ఎర్రవల్లికి వెళ్లే రహదారిపై స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. 
అంచనాకు మించి అధికసంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశమున్నదని, ఆ మేరకు ఏర్పాట్లు ఉండాలని కేసీఆర్ ఆదేశించడంతో భోజనశాల షామియానాలను పెంచుతున్నారు. రోజు దాదాపు 50 వేల మంది ఇబ్బంది లేకుండా భోజనాలు చేసేలా ఏర్పాట్లు కల్పిస్తున్నారు. సుమారు 300 వరకు బయో మరుగుదొడ్లను యాగశాల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. సందర్శకుల వాహనాల తాకిడి ఎక్కువగా ఉంటే ఎర్రవల్లి వద్ద వాహనాలను నిలిపివేసి అక్కడి నుంచి బస్సుల ద్వారా యాగశాల వరకు సందర్శకులను తరలించేందుకు కూడా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment