తాజా వార్తలు

Wednesday, 23 December 2015

అయుతం అద్భుతం

ఐదు రోజుల అయుత మహా చండీయాగం… మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో శోభాయమానంగా మొదలైంది. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు గురు ప్రార్థనతో యాగం ప్రారంభమైంది. ఆ తర్వాత గోపూజ.. మహా మంటప స్థాపనం.. చండీ యంత్ర లేఖనం.. యంత్ర ప్రతిష్ట.. దేవతా ఆవాహనము.. ప్రాణ ప్రతిష్ట..  సహస్ర చండీ పారాయణము.. పంచబలి… యోగినీ బలి.. మహారుద్ర పురశ్చరణా చతుర్వేద యాగము.. మహా సౌరము.. ఉక్త దేవతా జపాలు.. మంత్ర పుష్పం.. ఇలా.. కీలకమైన ఒక్కో ఘట్టాన్ని… పండితులు శ్రాస్త్రోక్తంగా పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు తొలి రోజు పూజల మొదటి ఘట్టం ముగిసింది. మధ్యాహ్నం నుంచి.. పూజా కార్యక్రమాలతో పాటు.. ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీరామలీల గేయ కథాగానం.. హరికథా కవిరాజు.. గేయ వాల్మీకీ.. ధార్మిక ప్రవచనాలు భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచాయి. సాయంత్రం కోటి నవాక్షరీ పురశ్చరణం.. విశేష పూజ.. ఆశ్లేషా బలి.. అష్టావధాన సేవలను పండితులు పూర్తి చేశారు. మొత్తం ఆరుగురు రుత్వికుల ఆధ్వర్యంలో… 108 హోమ గుండాల్లో యాగం కొనసాగింది. అయుత చండీ యాగానికి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శృంగేరీ పీఠాధిపతి ప్రత్యేక దూతగా వచ్చిన గౌరీ శంకర్.. సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. గవర్నర్ నరసింహన్.. సతీ సమేతంగా యాగానికి హాజరయ్యారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పండిట్ రవిశంకర్.. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు అటెండయ్యారు. అతిథులను సత్కరించి.. వారి నుంచి సీఎం కేసీఆర్ దంపతులు ఆశీర్వచనాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి భక్తజనం వేలాదిగా తరలివచ్చారు. మహిళలు కుంకుమార్చనలు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment