తాజా వార్తలు

Friday, 11 December 2015

బెంగాళ్ టైగర్ రివ్యూ

రవితేజ, సంపత్‌నంది ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే కాస్త మాస్ డోస్ ఎక్కువే.. అందుకే తొలినుంచే బెంగాల్ టైగర్‌పై అంచనాలు ఎక్కువగానే వున్నాయి. 
 
ఆత్రేయపురం అనే పల్లెటూరిలో పుట్టి పెరిగిన రవితేజకు సెలిబ్రిటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది కల. అందుకోసం తపన పడే వ్యక్తిత్వం అతగాడిది. మీడియాలో కనిపించాలనే కోరికతో మంత్రి సాంబు.. షాయాజీషిండేను ఓ మీటింగ్‌లో రాయితో కొట్టి తొలిసారి వార్తల్లో నిలుస్తాడు. అతడి గట్స్‌కు ఫిదా అయిన సాంబు ఆకాష్‌ను తన వద్దనే ఉద్యోగం ఇస్తాడు. ఆ తర్వాత కొన్ని కారణాలతో హోమ్‌మినిస్టర్ రావు రమేష్ దగ్గర చేరుతాడు. ఓ ప్రమాదం నుంచి అతడి కూతురు రాశీఖన్నాను కాపాడి హోమ్‌మినిస్టర్‌కు, ఆయన కూతురుకు దగ్గరవుతాడు ఆకాష్. శ్రద్ధ పుట్టినరోజు వేడుకలో ఆకాష్‌కు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రకటిస్తాడు హోమ్ మినిస్టర్. కానీ తనకు ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్ట లేదని చెప్పడంతో కథలో అసలు ట్విస్టు మొదలవుతుంది. అసలు ఆకాష్ అలా ఎందుకు చెప్పాడు. ఆ తర్వాత కథలో ఎంట్రీ ఇచ్చిన తమన్నాతో ఆకాష్‌కు వున్న సంబంధం ఏమిటి? అసలు అతని లక్ష్యం ఏమిటి? అనేది తెరపై చూస్తేనే ఆసక్తికరంగా వుంటుంది. 

ఆకాష్‌గా రవితేజ పాత్ర, అతని అభినయం థియేటర్‌లో క్లాప్స్ కొట్టించే విధంగా వుంది. అయితే ఇటీవల స్లిమ్ అయిన రవితేజలో తగ్గిన ఛార్మ్ మాత్రం అతని పాత్రలో కనిపించింది. ఫుల్ ఎనర్జీ పాత్రలో రవితేజ హుషారుగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ ఏపిసోడ్స్‌లో ఫెరోషియస్‌గా కనిపించాడు. తమన్నా, రాశిఖన్నా అందచందాలకు కుర్రకారు ఫిదా అయిపోవాల్సిందే.. అంత గ్లామర్‌గా ఈ ఇద్దరూ కనిపించారు. 30ఇయర్స్ పృథ్వీ ఈ సినిమాతో కమెడియన్‌గా తన రేంజ్‌ను పెంచుకున్నాడు. ఫ్యూచర్‌స్టార్ సిద్ధప్పగా సినిమాలో కావాల్సినంత వినోదాన్ని పండించాడు. సెలిబ్రిటి శాస్త్రిగా పోసాని నటన కూడా ఆకట్టుకుంటుంది. బొమాన్ ఇరానీ పాత్రను మరింత పవర్‌ఫుల్ ప్రతినాయకుడిగా తీర్చిదిద్దితే బాగుండేది. బ్రహ్మానందం కూడా కనిపించిన కాసేపు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. 
 
« PREV
NEXT »

No comments

Post a Comment