తాజా వార్తలు

Thursday, 17 December 2015

'బ్రహ్మెత్సవం' ఆహ్వానం


సూపర్‌స్టార్‌ మహేష్‌తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి క్లాస్‌ మూవీని తీసి ప్రేక్షకులకు బాగా దగ్గరైన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పివిపి సినిమా పతాకంపై పివిపి నిర్మాతగా శ్రీకాంత్‌ అడ్డాల రూపొందిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బ్రహ్మూెత్సవం'. చాలా నేచురల్‌ సీన్స్‌తో సినిమాలు రూపొందించే శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రాన్ని కూడా అందర్నీ ఆకట్టుకునేలా చిత్రీకరిస్తున్నారు. నటనపై ఆసక్తి వున్న రియల్‌ ఫ్యామిలీస్‌ని ఈ చిత్రంలో నటించేందుకు ఆహ్వానిస్తోంది 'బ్రహ్మూెత్సవం' టీమ్‌. వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారైనా ఈ చిత్రంలో నటించేందుకు అర్హులు. ఆసక్తి వున్నవారు తమ ఫ్యామిలీకి సంబంధించిన రెండు ఫోటోలు, కాంటాక్ట్‌ డీటైల్స్‌ను pvpcinema@pvpglobal.com అనే మెయిల్‌ ఐడికి పంపించాల్సిందిగా పివిపి సినిమా టీమ్‌ కోరుతోంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment