తాజా వార్తలు

Sunday, 27 December 2015

పీకల్లోతు నీటిలో బ్రిటన్

ఉత్తర బ్రిటన్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 300పైగా వరద హెచ్చరికలు చేశారు. లాంక్షైర్, కంబ్రియల్లో ఒకే రోజు రెండు సార్లు  హెచ్చరికాలు జారీ చేశారు. ఆదివారం కూడా పరిస్థితి యథావిధిగానే ఉంది. వందల మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. యార్క్లోని ఔస్, పోస్ నదితీర ప్రాంతాల్లో 400 వరకు ఇళ్లు ఖాళీ చేయాలని పోలీసులు సూచించారు. వరదలపై అత్యవసర కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రకటించారు. వరద ప్రాంతాల్లో సైన్యం ఇప్పటికే ముమ్మర సహాయక చర్యలు చేపట్టింది
« PREV
NEXT »

No comments

Post a Comment