తాజా వార్తలు

Friday, 4 December 2015

అమెరికా కాల్పుల విచారణలో పురోగతి

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దాడులకు పాల్పడిన పాకిస్థాన్ సంతతికి చెందిన ఫరూక్, మాలిక్ యువజంటకు ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఫరూక్ పలుమార్లు ఇస్లామిక్ తీవ్రవాదులతో సంభాషణలు జరిపినట్లు తమ విచారణలో తేలినట్లు స్పష్టం చేశారుదాడులకు పాల్పడిన సమయంలో వందలాది మందిని హతమార్చడానికి సరిపడే మారణాయుధాలు ఫరూక్ వద్ద ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దాడుల తర్వాత ప్రాధమికంగా చేపట్టిన విచారణలో ఫరూక్కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే విషయం స్సష్టంకాలేదు. వారి కుటుంబంతో పరిచయం ఉన్నవారు సైతం వారు దాడులకు పాల్పడ్డారంటే నమ్మలేకుండా ఉన్నారు. గతంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎఫ్బీఐ నిఘా పరిధిలో ఫరూక్ దంపతులు లేరని అధికారులు వెల్లడించారుఅమెరికాలో వికలాంగుల క్రిస్మస్ పార్టీ రక్తసిక్తమైందికాలిఫోర్నియాలో వికలాంగుల కోసం క్రిస్మస్ పార్టీ నిర్వహిస్తున్న బృందంపై పాక్ సంతతికి చెందిన దంపతులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఘటనలో 14 మంది మరణించగామరో 17 మంది గాయపడ్డారుక్రిస్మస్ పార్టీకి హాజరైన ఫరూక్ ఒకరితో గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోయారని బర్గౌన్ చెప్పారు. సైనిక దుస్తుల్లో రైఫిల్స్, హ్యాండ్గన్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలతో తిరిగి వచ్చి కాల్పులకు తెగబడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందనే విషయాన్ని కొట్టివేయలేమనే అభిప్రాయాన్ని పోలీసు అధికారి బర్గౌన్ వ్యక్తం చేశారు. అత్యాధునిక ఆయుధాలు, ప్రత్యేకమైన దుస్తులు సిద్ధం చేసుకోవడాన్ని పరిశీలిస్తే .. దాడికి ముందే కుట్ర పన్నారని అర్థమవుతున్నది. కేవలం యథాలాపంగా అలా పరుగెత్తి.. తుపాకులు చేతపట్టుకొని వచ్చి కాల్పులు జరపలేదని విషయం స్పష్టమవుతున్నది అని బర్గౌన్ పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment