తాజా వార్తలు

Saturday, 26 December 2015

తెలంగాణపై మరో ఐదు రోజులు చలిపులి

తెలంగాణ రాష్ట్రంపై మరో ఐదు రోజులు చలిపులి పంజా విసురుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మరో ఐదురోజుల పాటు రాష్ట్రంలో అతిశీతల గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది. ఈ నెల 30 వరకు అన్ని జిల్లాల్లో అతి శీతల గాలుల ప్రభావం కొనసాగనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో చలిని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. 
« PREV
NEXT »

No comments

Post a Comment