తాజా వార్తలు

Thursday, 3 December 2015

చెన్నై వరద బాధితులకు అండగా ఫిల్మ్ ఇండస్ట్రీ

భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 9 జిల్లాలు వరద తాకిడికి గురైన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా చెన్నై పట్టణం ముంపుకు గురి కావడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఎంతో మంది నిరాశ్రయులు కావడం మనం చూస్తున్నాం. నేపథ్యంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కలిసి వరద బాధితులకు 15 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి మొత్తాన్ని అందజేస్తారుఆంధ్రప్రదేశ్కు రూ.5 లక్షలు 
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాలు వరదల తాకిడికి గురయ్యాయి. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. మొత్తాన్ని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించనున్నారు
సూపర్‌స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించి ప్రస్తుతం యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మరో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ చెన్నై వరద బాధితుల సహాయార్థం రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. విరాళాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సి.వి.ఎం) తెలిపారు

ఎల్లప్పుడూ  తన వంతు  ఏదో సహాయం  చేస్తూ కొందరికి బరోసా కల్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు నిర్మాత ప్రతాప్ కోలగట్ల(3జి లవ్).   
ఇక గతం లో వైజాగ్ హూద్ హూద్ తుఫాన్ భాధితుల సహాయార్ధం 1లక్ష విరాళాన్ని ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు గారిని కలిసి అందించారు ప్రతాప్. ఇక సూర్య, విశాల్  వంటి  తమిళ నటులు  మన వైజాగ్  హుడ్ హుడ్ తుఫాన్ కి  స్పందించి లక్షల రూపాయిల విరాళం అందించారు.  ఇప్పుడు అలాంటి విప్పత్తే చెన్నై ని తాకింది. సమయం లో మన  తెలుగు చిత్ర పరిశ్రమ నుండి  స్పందించి సాయం అందించాల్సిన సమయం వచ్చింది. నా వంతుగా రూ.1.00,000 అందిస్తున్నాను. అని నిర్మాత ప్రతాప్ కోలగట్ల  ప్రకటించారు.. అతి త్వరలో  ముఖ్య మంత్రి  జయలలిత గారికి కలిసి సాయాన్ని అందిస్తాను అని  తెలిపారు.  తన బాటలోనే  మన తెలుగు చిత్ర పరిశ్రమ కు  సంబంధించిన మరి కొందరు ముందుకు వచ్చి సహాయం  అందించాలని  తన  ఆశా భావాన్ని వ్యక్త పరిచారు.

« PREV
NEXT »

No comments

Post a Comment