తాజా వార్తలు

Thursday, 3 December 2015

చెన్నై వరదల్లో మరో విషాదం

చెన్నైలో వరద సృష్టించిన బీభత్సం అంతాఇంతకాదు. వందలాది మంది వరదలకు మృత్యువాత పడ్డారు. దీనికి తోడు... మరో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని ఎంఐవోటీ ఆసుపత్రిలో ఆక్సిజన్, విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఐసీయూల్లో చికిత్స పొందుతున్న 14 మంది రోగులు మరణించారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వారం రోజుల నుంచి నగరంలో కరెంట్ సరఫరా నిలిచిపోయిందిదీనికి తోడు వరద నీరు సిటీని ముంచెత్తడంతో రహదార్లపై సుమారు 8 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. చాలా ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితే ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరదల బీభత్సంతో చెన్నైలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాల ఉద్యోగులు వారి వారి స్వంత ప్రాంతాలకు తరలి వెళ్తున్నరు. 

« PREV
NEXT »

No comments

Post a Comment