తాజా వార్తలు

Wednesday, 2 December 2015

తమిళనాడులో మళ్లీ వర్షాలు

తమిళనాడులో భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెన్నైలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. చెన్నై నుంచి బయల్దేరే 23 రైల్వే సర్వీసులను రద్దు చేశామని రైల్వే శాఖ పీఆర్ అనిల్ సక్సేనా తెలిపారు. మరో 11 రైళ్లను దారిమళ్లించామని, మరో 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. చాలాచోట్ల రైల్వే ట్రాక్లపై నీరు ప్రవహిస్తోందని, వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత సర్వీసులు పునరుద్దరిస్తామన్నారు. రద్దైన రైళ్ల సమాచారాన్ని ప్రచార సాధనాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు అనిల్ సక్సేనాభారీ వర్షాల కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చిన్నపాటి నదిని తలపిస్తోంది. దీంతో విమానాలు పడవల్లా తేలుతున్నాయి. వరుసగా పార్కింగ్ చేసిన విమానాలు పడవల్లా కన్పిస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారుచెన్నై విమానాశ్రయం మొత్తం నీటితో నిండిపోయింది. విమాన సర్వీసులు పూర్తిగా రద్దు చేశారు. ఇక చెన్నై మీదుగా వెళ్లాల్సిన 19 రైళ్లు కూడా రద్దు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment