తాజా వార్తలు

Friday, 4 December 2015

చెన్నై నగరానికి రొంబ కష్టం

జలదిగ్బంధంలో విలవిలలాడుతున్న చెన్నై మహానగరాన్ని మరోసారి వర్షాలు చుట్టుముట్టాయివానలువరదల కారణంగా మరణించినవారి సంఖ్య 280కి చేరుకున్నది. 12 గంటలపాటు వానలు తెరిపి ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలకు ఊరట ఎంతోసేపు నిలవలేదుఉదయం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ మధ్యాహ్నం నగరంలో చెదురుముదురుగా వర్షాలు పడ్డాయివరదల భయంతో వేలాది మంది నగరాన్ని వదిలిపెట్టి వెళుతున్నారునీట మునిగిన నగరంలో జనజీవితం ఇంకా అస్తవ్యస్తంగానే కొనసాగుతున్నదిచెన్నైతోపాటుగా తమిళనాడులోని అనేక ప్రాంతాలు ఇంకా నీటిలోనే మునిగిపోయి ఉన్నాయిజనజీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదురైలురోడ్డు రవాణాతోపాటుగా విమాన సర్వీసులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయిముందుజాగ్రత్త చర్యగా ఇంకా అనేకప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదుమొబైల్ సేవలు పాక్షికంగా పునరుద్ధరించారుఏటీఎంలు మాత్రం ఇంకా పనిచేయడం లేదునిత్యావసర సరుకులు దొరకక ఇబ్బందులు పడుతున్న జనాలకు ధరల పెరుగుదల అదనపు భారంగా మారిందిమందులుపాలుమంచినీరుకూరగాయలకు తీవ్రకొరత ఏర్పడింది.
కనివిని ఎరుగని వరదల నేపథ్యంలో సైన్యం భారీఎత్తున రక్షణసహాయక చర్యలు నిర్వహిస్తున్నదిసైనికనౌకాదళవైమానికదళ జవాన్లు సహాయక కార్యక్రమాలు పెద్దెత్తున నిర్వహిస్తున్నారుజాతీయ విపత్తు సహాయక దళం కూడా సహాయక కార్యక్రమాలను ఉధృతం చేసిందిఅదనపు బృందాలను రంగంలోకి దింపిందినీటిలో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడడంఆహార పదార్థాలను అందించడం వంటి సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగిస్తున్నారుసహాయ చర్యలపై ప్రజల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నరుఅధికారులపైమంత్రులపై విరుచుకుపడుతున్నారుమరోవైపు చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామటాలజీ హాస్పిటల్ రోగులకు ప్రాణాంతకంగా పరిణమించిందిశుక్రవారం ఉదయం దవాఖానాలో కనీసం 18 మంది మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారుమరణించిన రోగులందరూ వెంటిలేటర్పై ఉన్నవారేవరదల్లో చిక్కుకుపోయిన దవాఖానాకు విద్యుత్ సరఫరా లేకపోవడంఆక్సిజన్ సిలిండర్లు సరఫరా కాకపోవడం వల్లే మరణాలు సంభవించినట్టు చెప్తున్నారుఇదిలా ఉంటేచెన్నైలో మరో రెండు రెండుమూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిందిఅయితే వర్షాల తీవ్రత మాత్రం ముందుగా ప్రకటించినంత అధికస్థాయిలో ఉండదని తెలిపింది.      

« PREV
NEXT »

No comments

Post a Comment