తాజా వార్తలు

Wednesday, 2 December 2015

రామ్ చరణ్‌కి చిరంజీవి వార్నింగ్!

తమిళ హిట్ మూవీ ‘థాని ఒరువన్' చిత్రాన్ని రామ్ చరణ్ తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. రామ్ చరణే స్వయంగా ఈ చిత్రం రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే తమిళ వెర్షన్ ఉన్నది ఉన్నట్లుగా తీయకుండా కొన్ని మార్పులు చేసి రామ్ చరణ్ ఇమేజ్ కు తగిన విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవికి చెప్పగా.... అలా చేయొద్దు అంటూ హెచ్చరించినట్లు సమాచారం.

కాగా... తమిళంలో విలన్ పాత్ర పోషించిన అరవింద స్వామి తెలుగులో కూడా నటించనున్నాడు. తెలుగులో నటించడానికి అరవింద స్వామి రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నాడట. తెలుగులో ఆయన పాత్ర కీలకం కావడంతో ఆయన అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఓకే చెప్పారట. రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా ఫలితంతో రూటు మార్చాడు. ఈ సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకూడదని, కేవలం సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో షేరింగ్ మాత్రమే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. ఇలా చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని, సినిమాను నష్టాల భారి నుండి తప్పించవచ్చని అంటున్నాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment