తాజా వార్తలు

Wednesday, 23 December 2015

అండర్ వరల్డ్ డాన్ కారుకు నిప్పు

దావూద్‌ ఇబ్రహీం కారుకు నిప్పు పెట్టారు. దావూద్‌ కారును డిసెంబర్‌ 9న ముంబయిలో వేలం వేశారు. ఆకుపచ్చరంగు హ్యుందాయ్‌ అసెంట్‌ కారును వేలంలో రూ.32 వేలకు చక్రపాణి దక్కించుకున్నారు. కారు అంబులెన్స్ లా మార్చాలనుకున్నానని ఆయన అనుకున్నారు. అయితే దావూద్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో వారికి తగిన సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో దాన్ని బహిరంగంగా దహనం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. కారును కొద్ది రోజుల క్రితమే ముంబై నుంచి నుంచి ఘజియాబాద్‌ తీసుకొచ్చారు. ఉత్తర ప్రదేశ్  ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో హిందూ మహాసభ కార్యకర్తలు ఈ కారుకు నిప్పంటించారు. ఉగ్రవాద కార్యకలాపాలను అంతమొందించే లక్ష్యంగా ఈ కారును ఇలా దహనం చేస్తున్నామని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment