తాజా వార్తలు

Tuesday, 22 December 2015

డిప్రెషన్ లో నుంచి పుట్టుకొచ్చిందే..లివ్ లవ్ లాఫ్..


లివ్ లవ్ లాఫ్ సంస్థకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని దీపిక చెబుతుంది. తీవ్రాతితీవ్రంగా డిప్రెషన్‌తో కుంగిపోయారు. తర్వాత బయట పడ్డారనుకోండి. అయితే చాలా మంది అలాంటి విషయాలు మీడియా ముందు చెప్పరు. కానీ దీపిక చాలా ధైర్యంగా తన మానసిక పరిస్థితి గురించి చెప్పేశారు.అంతేకాకుండా  తనలా డిప్రెషన్‌లో కుంగిపోయిన వారికి అండగా నిలబడటం కోసం ‘ లివ్ లవ్ లాఫ్’ అనే సంస్థను నెలకొల్పారు.  ‘‘ కేవలం  ఫార్మాస్యూటికల్ కంపెనీకి ప్రచారం కోసం ఈ సంస్థ నెలకొల్పారని, ఇదో పబ్లిసిటీ స్టంట్ అని చాలా మంది నన్ను మొదట్లో విమర్శించారు.  కానీ ఈ సంస్థ గురించి వస్తున్న రెస్పాన్స్  మాత్రం సూపర్బ్.  మీ వల్ల నా ప్రాణం నిలబడింద ని చెబుతూ ఓ అమ్మాయి నాకు సందేశం పంపింది. అదొక్కటి చాలు. ఇలాంటి మెసేజ్‌లు కొన్ని వేల సంఖ్యల్లో వస్తున్నాయి.  నాలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ .అంతేగానీ  డబ్బు సంపాదించాలన్న అత్యాశ మాత్రం కాదు’’ అని దీపిక స్పష్టం చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment