Writen by
Unknown
18:00
-
0
Comments
ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేపట్టిన ఆడ్, ఈవెన్ ఫార్ములాను అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో జనవరి 1 నుంచి 15వరకు
స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వం సరి, బేసి సంఖ్యల ఫార్ములాను సమర్థంగా అమలు చేసేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 6వేల బస్సులు నడపాలని సర్కారు భావిస్తోంది. మరోవైపు కాలుష్య
నియంత్రణ కోసం ఢిల్లీలో అమలు చేయాలనుకుంటున్న సరి, బేసి సంఖ్య విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు మధ్య కో-ఆర్డినేషన్ లోపించింది. ఈ విధానంపై తమకు ఇంకా ఎలాంటి సమాచారం లేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ అన్నారు. డిసెంబర్ 25న
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమావేశాలు నిర్వహించి యాక్షన్ ప్లాన్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
No comments
Post a Comment