తాజా వార్తలు

Tuesday, 8 December 2015

మున్నాబాయ్ వచ్చేస్తున్నాడు

సంజయ్ దత్‌కు త్వరలోనే విముక్తి లభించనుంది. వచ్చే ఏడాది మార్చి 7న ఆయన జైలు నుంచి విడుదల కానున్నారని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. 42 నెలల శిక్షాకాలం పూర్తిచేసుకుని జైలు నుంచి విడుదల అవుతాడని తెలుస్తోంది.18 నెలలు అండర్ ట్రయల్ ఖైదీగానూ సంజయ్ ఉన్నాడు. 1993 ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని ఆరోపణలపై టాడా చట్టం కింద సంజయ్ దత్ కు జైలుశిక్ష పడిన విషయం అందరికీ విదితమే. శిక్షాకాలంలో తోటి ఖైదీలతో సత్ర్పవర్తనతో మెలిగిన సంజయ్‌ దత్‌ ఇప్పటికే పలుమార్లు పెరోల్‌ మీద బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపారు. బాలీవుడ్ టాప్‌ హీరోల్లో ఒక్కరైన సంజయ్‌దత్ 'మున్నాభాయ్‌ ఎంబీబీఎస్', 'లగేరహో మున్నాభాయ్‌', 'ఖల్‌నాయక్‌' వంటి హిట్‌ సినిమాల్లో నటించారు. మహారాష్ట్ర ఎరవాడ సెంట్రల్‌ జైలులో సంజయ్ దత్  శిక్ష అనుభవిస్తున్నవిషయం తెలిసిందే.. 
« PREV
NEXT »

No comments

Post a Comment