తాజా వార్తలు

Saturday, 12 December 2015

27న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

రాష్ర్టంలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు  నెల 27 ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్  చెప్పారుఆరుగురు టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని  భన్వర్ లాల్ ప్రకటించారు. ఐదు జిల్లాల్లోని ఆరు స్థానాల్లో ఇతర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టిఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందన్నారు. ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయిన ఐదు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండదని ఆయన ప్రకటించారుఏకగ్రీవమైన స్థానాలను మినహాయిస్తే.. మిగిలిన 6 ఎమ్మెల్సీ స్థానాల్లో  27 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. నెల 30 ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటర్లను ప్రలోభపెడితే తగిన చర్యలు తీసుకుంటామని భన్వర్ లాల్ హెచ్చరించారు.


« PREV
NEXT »

No comments

Post a Comment