తాజా వార్తలు

Friday, 18 December 2015

బయటి ప్రపంచంతో బ్రెజిల్ తెగతెంపులు

వాట్సాప్ పై బ్రెజిల్ లోని ఓ కోర్టు 48 గంటల నిషేధం విధించింది.  కోర్టు తీర్పుపై వాట్సాప్ సీఈవో జాన్ కోమ్ స్పందించారు. ఈ తీర్పుతో తాము తీవ్ర నిరాశ చెందామన్నారు. ఎంతోమంది బ్రెజిలియన్‌లు దీనిపై ఆధారపడి ఉన్నారన్నారు. బ్రెజిల్‌ స్వయంగా ప్రపంచంతో సంబంధాలు తెంపుకొందని వ్యాఖ్యానించారు. వాట్సాప్‌పై నిషేధాన్ని ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ విమర్శించారు. బ్రెజిలియన్లకు ఇది చాలా విచారకర దినమని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఓపెన్‌ ఇంటర్నెట్‌కు బ్రెజిల్‌ మిత్రదేశంగానే ఉందన్నారు. వాట్సాప్‌ పై నిషేధం తొలగిపోయేదాకా ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ను వాడుకోవాలని ఆయన వినియోగదారులకు సూచించారు.  మరోవైపు వాట్సప్, ఫేస్ బుక్  నిషేధంతో దేశంలో దాదాపు తొమ్మిది కోట్ల 30 లక్షల మందిపై తీర్పు ప్రభావం పడింది. వాట్సాప్‌లో వారి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫేస్‌బుక్‌ యాజమాన్యం కింద ఉన్న వాట్సాప్ నేర విచారణకు సహకరించడంలో తరచూ విఫలమవుతోందని సావోపౌలో కోర్టు అభిప్రాయపడింది. 48 గంటల నిషేధం విధించింది. మత్తుపదార్థాల అక్రమ రవాణకు సంబంధించిన మెసేజ్‌లను నిలిపివేయాలని న్యాయస్థానం తెలిపింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment