తాజా వార్తలు

Saturday, 19 December 2015

నేడు నిజాం కాలేజీలో ప్రీ క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇవాళ నిజాం కళాశాలలో క్రైస్తవులకు ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 5 వేల మంది క్రిస్టియన్లకు భోజన వసతిని ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోపాటు మంత్రులు పాల్గొననున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను శనివారం సీసీఎల్‌ఏ కమిషనర్ రెమాండ్ పీటర్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్‌జలీల్, మైనార్టీ వెల్ఫేర్ కార్యదర్శి జలాలొద్దీన్ అక్బర్, కలెక్టర్ రాహుల్ బొజ్జా పర్యవేక్షించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment