తాజా వార్తలు

Tuesday, 8 December 2015

ఫ్లిప్ కార్ట్ లో రూ.476కోట్ల జీతాలు ఒక్క ఏడాదిలో పంచారట

గతేడాది ఫ్లిప్ కార్ట్  సంస్థ  ఎంప్లాయిస్ కు  476 కోట్ల రూపాయలను చెల్లించింది.  2014-15 సంవత్సరానికి గాను ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ మెకిన్ మహేశ్వరి 18.73 కోట్ల రూపాయల సాలరీని  అందుకున్నారు. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ సంస్థలో 23 మంది ఉద్యోగులు ఏడాదికి కోటి రూపాయలకుపైగా జీతాన్ని తీసుకుంటున్నారు. ఐటీసీ తరహాలో ఫ్లిప్ కార్ట్ కూడా ఉద్యోగుల టాలెంట్ ను గుర్తిస్తూ వారికి భారీ స్థాయిలో సాలరీలను ఇస్తోంది.  హిందుస్తాన్ యునిలివర్ ఎండీ సంజీవ్ మెహతా, ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ లాంటి టాప్ ఎగ్జిక్యూటివ్ ల సాలరీల కంటే మెకిన్ మహేశ్వరి జీతం ఎక్కువ కావడం విశేషం. కాగా మెకిన్ మహేశ్వరి గత సెప్టెంబర్  ఈ పదవి నుంచి తప్పుకుని .. సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. గతేడాది హిందుస్తాన్ యూనిలివర్ కంపెనీలో 169 మంది ఎగ్జిక్యూటివ్ లు ఎనిమిదంకెల జీతాన్ని  తీసుకున్నారు. ఇన్ఫోసిస్ లో 123 మంది, విప్రోలో 70 మంది ఉద్యోగులు కోటి రూపాయలకుపైగా జీతాన్ని అందుకున్నారు. ఈ ఏడాది ఈ కామర్స్ కంపెనీల్లో 500 మందికిపైగా ఎగ్జిక్యూటివ్ లు కోటి రూపాయల వేతనాలను తీసుకోబోతున్నారు. కాగా ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులకు తాము అందుకుంటున్న భారీ స్థాయి వేతనాలకు తగినట్టుగా టార్గెట్ ను రీచ్ కావడంతో పాటు…ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment